వార్తలు
మమ్మల్ని సంప్రదించండి
తెలుగు
KJV
தமிழ்
ಕನ್ನಡ
हिन्दी
లూకా
ఆదికాండము
నిర్గామకాండము
లేవీకాండము
సంఖ్యాకాండము
ద్వితియోపదేశకాండము
యెహోషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1 దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు
కీర్తనలు
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా
యిర్మియా
విలాపవాక్యములు
యెహేజ్కేలు
దానియేలు
హోషేయా
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపో. కార్యములు
రోమీయులకు
1 కోరింథీయులకు
2 కోరింథీయులకు
గలతియులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలస్సీయులకు
1 థెస్సలొనికయులకు
2 థెస్సలొనికయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథం
23
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
1
అంతట వారందరును లేచి ఆయనను పిలాతునొద్దకు తీసికొనిపోయి
2
ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.
3
పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయననీ వన్నట్టే అని అతనితో చెప్పెను.
4
పిలాతు ప్రధాన యాజకులతోను జనసమూహములతోనుఈ మనుష్యుని యందు నాకు ఏ నేరమును కనబడలేద నెను.
5
అయితే వారుఇతడు గలిలయదేశము మొద లుకొని ఇంతవరకును యూదయదేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపు చున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.
6
పిలాతు ఈ మాట వినిఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి
7
ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలిసికొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.
8
హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగో రెను.
9
ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలువేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు.
10
ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి.
11
హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరల పంపెను.
12
అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.
13
అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
14
ప్రజలు తిరుగబడునట్లు చేయు చున్నాడని మీరీమనుష్యుని నాయొద్దకు తెచ్చి తిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీ రితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడ
15
హేరోదునకు కూడ కనబడలేదు.హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణ మునకు తగినదేదియు ఇతడు చేయలేదు.
16
కాబట్టి నేనితనిని
17
శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా
18
వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి.
19
వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.
20
పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.
21
వారు వీనిని సిలువవేయుము సిలువవేయుము అని కేకలు వేసిరి.
22
మూడవ మారు అతడుఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను.
23
అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువవేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.
24
కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి
25
అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్త మును చెరసాలలో వేయబడియుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.
26
వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.
27
గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టు కొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.
28
యేసు వారివైపు తిరిగియెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.
29
ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.
30
అప్పుడుమామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.
31
వారు పచ్చిమ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను.
32
మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.
33
వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.
34
యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.
35
ప్రజలు నిలువబడి చూచు చుండిరి; అధికారులునువీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన యెడల తన్నుతానురక్షించుకొనునని అపహసించిరి.
36
అంతట సైనికులు ఆయనయొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి
37
నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి.
38
ఇతడు యూదుల రాజని పైవిలాసముకూడ ఆయనకు పైగా వ్రాయబడెను.
39
వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచునీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను.
40
అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?
41
మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి
42
ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.
43
అందు కాయన వానితోనేడు నీవు నాతోకూడ పర దైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా ననెను.
44
అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను;
45
సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భా లయపు తెర నడిమికి చినిగెను.
46
అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
47
శతాధిపతి జరిగినది చూచిఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.
48
చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టు కొనుచు తిరిగి వెళ్లిరి.
49
ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబ డించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
50
అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను.
51
అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టు చుండినవాడు.
52
అతడు పిలాతునొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని
53
దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.
54
ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.
55
అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి
56
తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.
‹
›