వార్తలు
మమ్మల్ని సంప్రదించండి
తెలుగు
KJV
தமிழ்
ಕನ್ನಡ
हिन्दी
యోబు
ఆదికాండము
నిర్గామకాండము
లేవీకాండము
సంఖ్యాకాండము
ద్వితియోపదేశకాండము
యెహోషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1 దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు
కీర్తనలు
సామెతలు
ప్రసంగి
పరమగీతము
యెషయా
యిర్మియా
విలాపవాక్యములు
యెహేజ్కేలు
దానియేలు
హోషేయా
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపో. కార్యములు
రోమీయులకు
1 కోరింథీయులకు
2 కోరింథీయులకు
గలతియులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలస్సీయులకు
1 థెస్సలొనికయులకు
2 థెస్సలొనికయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన గ్రంథం
36
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
1
మరియు ఎలీహు ఇంక యిట్లనెను
2
కొంతసేపు నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేసెదను. ఏలయనగా దేవునిపక్షముగా నేనింకను మాటలాడ వలసి యున్నది.
3
దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను.
4
నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు.
5
ఆలోచించుము దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు ఆయన వివేచనాశక్తి బహు బలమైనది.
6
భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించును.
7
నీతిమంతులను ఆయన చూడకపోడు సింహాసనముమీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెట్టును వారు ఘనపరచబడుదురు.
8
వారు సంకెళ్లతో కట్టబడినయెడలను బాధాపాశములచేత పట్టబడినయెడలను
9
అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి వారి దోషము లను వారికి తెలియజేయును.
10
ఉపదేశము వినుటకై వారి చెవిని తెరువజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును.
11
వారు ఆలకించి ఆయనను సేవించినయెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు.
12
వారు ఆలకింపనియెడల వారు బాణములచేత కూలి నశించెదరు. జ్ఞానములేక చనిపోయెదరు.
13
అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తిలేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించునప్పుడు వారు మొఱ్ఱపెట్టరు.
14
కావున వారు ¸°వనమందే మృతినొందుదురు వారి బ్రదుకు పురుషగాముల బ్రదుకువంటిదగును.
15
శ్రమపడువారిని వారికి కలిగిన శ్రమవలన ఆయన విడిపించును.బాధవలన వారిని విధేయులుగా చేయును.
16
అంతియేకాక బాధలోనుండి ఆయన నిన్ను తప్పిం చును. ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపును.
17
దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది న్యాయవిమర్శయు తీర్పును కూడుకొనియున్నవి.
18
నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుము నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయెదవేమో జాగ్రత్తపడుము.
19
నీవు మొఱ్ఱపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయుబాధనొందకుండ నిన్ను తప్పించునా?
20
జనులను తమ స్థలములలోనుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము.
21
జాగ్రత్తపడుము చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవముకన్న అది మంచిదని నీవు వాని కోరు కొనియున్నావు.
22
ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడుఆయనను పోలిన బోధకుడెవడు?
23
ఆయనకు మార్గము నియమించినవాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును?
24
మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్తపడుము.
25
మనుష్యులందరు దాని చూచెదరు నరులు దూరమున నిలిచి దాని చూచెదరు.
26
ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది.
27
ఆయన ఉదకబిందువులను పైనుండి కురిపించును మంచుతోకూడిన వర్షమువలె అవి పడును
28
మేఘములు వాటిని కుమ్మరించును మనుష్యులమీదికి అవి సమృద్ధిగా దిగును.
29
మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?
30
ఆయన తనచుట్టు తన మెరుపును వ్యాపింపజేయును సముద్రపు అడుగుభాగమును ఆయన కప్పును.
31
వీటివలన ఆయన ఆ యా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు
32
ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును
33
ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధిచేయును తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.
‹
›